మంచి రోజులు కాదు యు.పి.ఏ రోజులే తిరిగొచ్చాయ్

“అచ్ఛే దిన్ ఆనేవాలా హై” (మంచి రోజులు వస్తున్నాయ్)… ఇది బి.జె.పి/ఎన్.డి.ఏ/నరేంద్ర మోడి ఎన్నికల నినాదం. ఇవ్వడానికి ఈ నినాదమే ఇచ్చినా తాము అమలు చేస్తున్నది మాత్రం యు.పి.ఏ విధానాలే అని పార్లమెంటు సాక్షిగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆహార ధరలు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం ఊర్ధ్వ స్ధాయిలో కొనసాగుతుండడంతో స్వల్ప కాల చర్చకు సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. యు.పి.ఏ చేసిన నిర్ణయాలనే తాము అమలు చేస్తున్నామని ఆయన…

హ్యాట్రిక్ ఊపులో మన్మోహన్ -కార్టూన్

వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు. అసలు…