అమెరికా చెబుతున్నది అబద్ధం -భారత జాలర్లు

కాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశామని అమెరికా చెబుతున్నది ఒట్టి అబద్ధమని దుబాయ్ తీరంలో అమెరికా సైనికుల కాల్పుల్లో గాయబడిన భారత జాలర్లు ‘ది హిందూ’ కు తెలిపారు. యు.ఏ.ఇ కి చెందిన కంపెనీలో పని చేస్తున్న భారత జాలర్లపై అక్కడి అమెరికా సైనిక స్ధావరానికి చెందిన సైనికులు కాల్పులు జరపడంతో ఒక భారతీయ జాలరి చనిపోగా, మరో ముగ్గురు జాలర్లు గాయపడ్డారు. కాల్పులకు ముందు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశామనీ వినకపోవడంతో కాల్చారని అమెరికా చెబుతుండగా…

దుబాయ్ తీరంలో భారత జాలర్లను కాల్చి చంపిన అమెరికా సైనికులు

దుబాయి తీరంలో అమెరికా వైమానిక దళానికి చెందిన సైనికులు ఒక భారత జాలరిని కాల్చి చంపారు. మరో ముగ్గురు జాలర్లను తీవ్రంగా గాయపరిచారు. హెచ్చరికలు లెక్క చేయకుండా ఒక చిన్న బోటు ‘యు.ఎస్.ఎన్.ఎస్ ర్యాపేహనోక్’ ఓడ వైపుకి వేగంగా దూసుకు వచ్చిందనీ, దానితో రక్షణ కోసం కాల్పులు జరపక తప్పలేదనీ బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్ధావరం (ఫిఫ్త్ ఫ్లీట్) ప్రతినిధి ప్రకటించాడు. చనిపోయినవారు, గాయపడ్డవారు భారతీయులేనని అమెరికా ధ్రువపరిచిందని ‘ది హిందూ’ తెలిపింది. దుబాయ్ లోని…