ఇండియాలో 2 జి అవినీతి విచారణపై నార్వే ప్రధాని కలవరం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒత్తిడితో “2 జి కుంభకోణం” పై సి.బి.ఐ జరుపుతున్న విచారణ పట్ల నార్వే ప్రధాని స్టోల్సెన్ బర్గ్ కలవరపడుతున్నాడు. నార్వే ప్రభుత్వానికి చెందిన టెలినార్ టెలికం కంపెనీపై కూడా సి.బి.ఐ విచారణ జరుపుతుండడమే దీనికి కారణం. కేంద్ర టెలికం శాఖ మంత్రిగా పనిచేసిన ఎ రాజా అరెస్టు అయినప్పటికీ నార్వే ప్రధాని కలవరపడలేదు. రాజా తర్వాత కపిల్ సిబాల్ టెలికం మంత్రిగా రావడంతో టెలినార్ తో పాటు ఇతర ప్రవేటు టెలికం…