ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్

ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం లాగానే ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం కూడా భారత దేశంలోని వివిధ కళా, సాంస్కృతిక, విద్యా వ్యవస్ధలను కాషాయీకరించే పనిలో పడిపోయింది. చరిత్ర రచనా పద్ధతి (historiography) లోకి జొరబడి భారత దేశ చరిత్రకు సొంత అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఐ.సి.హెచ్.ఆర్ డైరెక్టర్ నియామకాన్ని చేసిన కేంద్రం తాజాగా పూనె లోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కి కూడా అర్హతలు లేని బి.జె.పి నేతను నియమించిన విమర్శలను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో పూనే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్…