యాహూ అస్తమయం ఇక గోడ మీది రాత!

గూగుల్ కంటే ముందు స్ధాపించబడి ఇంటర్నెట్ సర్చ్ ప్రపంచాన్ని రారాజుగా ఏలిన యాహూ త్వరలో ఒక స్వతంత్ర కంపెనీగా ఉనికి చాలించనున్నది. యాహూ కేంద్ర (కోర్) బిజినెస్ కార్యకలాపాలను అమెరికా టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం వెరిజాన్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దృష్ట్యా ఈ పరిణామం పూర్తి కావడమే ఇక మిగిలింది. ఆపరేటింగ్ బిజినెస్ గా పేర్కొనబడుతున్న యాహూ ఇంక్ కార్యకలాపాలను 4.4 బిలియన్ డాలర్లకు (వోక్స్ పత్రిక 4.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంది) కొనుగోలు…

యాహూ ఒడిలో టంబ్లర్, గూగుల్ ‘మేయర్’ పాచిక

గూగుల్ అభివృద్ధిలో దశాబ్ద కాలం గడిపి ప్రత్యర్ధి కంపెనీ ‘యాహూ’ సి.ఇ.ఓ గా పది నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన మెరిస్సా మేయర్, కొత్త బాధ్యతల్లో తన మొదటి పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. అంతర్జాలంలో విస్తృత యూజర్ బేస్ ఉన్న టంబ్లర్ బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేయడానికి యాహూ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్లకు (దరిదాపు 7,000 కోట్ల రూపాయలు) బేరం కుదిరినట్లు ఎ.పి వార్తా సంస్ధ సమాచారం.…