ఫిర్యాదు: అమెరికా యుద్ధ నౌక చర్య ప్రమాదకరం! -వీడియో

అమెరికా యుద్ధ నౌక ఒకటి తమ పెట్రోలింగ్ నౌకను ప్రమాదకరంగా ఆటంకపరిచిందని రష్యా ఆరోపించింది. మధ్యదరా సముద్రంలో ప్రయాణిస్తున్న తమ నౌకను అమెరికన్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక దాటి వెళుతూ అంతర్జాతీయ నావికా చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించిందని, ఇతర దేశాలకు నీతులు చెప్పేందుకు ముందుండే అమెరికా తన ప్రవర్తనను చక్క దిద్దు కోవాలని రష్యా కోరింది. అమెరికా నౌకా బలగం లోని డిస్ట్రాయర్ నౌక గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగల శక్తి కలిగినది. ‘యూ‌ఎస్‌ఎస్ గ్రేవ్ లీ’ అనే…