ఐఫోన్ X: తయారీ ఖర్చు $358, అమ్మకం ధర $1570 -విశ్లేషణ

మాకింతోష్ (మ్యాక్) కంప్యూటర్, ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్… ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎంత గిరాకీ అంటే ప్రపంచంలో అనేక దేశాల జి‌డి‌పి విలువల కంటే ఎక్కువగా యాపిల్ కంపెనీ వద్ద డబ్బు పోగుబడేటంత! ఐ ఫోన్ ను సొంతం చేసుకోవడం కోసం రెండేళ్ల క్రితం చైనా యువకుడు ఒకరు తన కిడ్నీని అమ్ముకున్నాడంటే యాపిల్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తంలో…

రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!

పన్ను ఎగవేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరింది యాపిల్ కంపెనీ. ప్రపంచ వ్యాపితంగా పదుల కొద్దీ డూప్లికేట్ కంపెనీలు స్ధాపించి ‘టాక్స్ ప్లానింగ్’ పేరుతో ‘టాక్స్ ఏవేజన్’ కి పాల్పడడంలో యాపిల్ నేర్పరి అని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తూ సదరు కంపెనీ 74 బిలియల్ డాలర్లు (దాదాపు రు. 4 లక్షల కోట్లకు సమానం) పన్ను ఎగవేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆరోపించడమే కాక విచారణ కూడా ప్రారంభించింది.…

అమెరికా కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉంది!

ప్రస్తుతం అమెరికా కోశాగార విభాగం కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉన్న సంగతి వెల్లడయ్యింది. తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వద్ద ఆపరేటింగ్ ఖర్చుల కోసం 73.7 బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. ఐఫోన్, ఐప్యాడ్ ల సృష్టికర్త యాపిల్ కంపెనీ అత్యంత తాజాగా వెల్లడించిన ఫైనాన్షియల్ ఫలితాల ప్రకారం కంపెనీ వద్ద 76.4 బిలియన్ డాలర్లు ఉంది. అంటే అమెరికా కోశాగారం కంటే 2.7 బిలియన్ డాలర్లు యాపిల్ కంపెనీ…