‘పెట్టుబడి’ క్రౌర్యానికి ఇద్దరు బలి

‘అనంత’ లాభాలను గుంజుకోవడానికి వెంపర్లాడే పెట్టుబడి క్రౌర్యానికి ఇద్దరు బలయ్యారు. మరణించినవారిలో ఒకరు కార్మిక యూనియన్ నాయకుడు కాగా మరొకరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్. యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పోలీసులు అమానుషంగా జరిపిన లాఠీ ఛార్జిలో కార్మికుల నాయకుడు చనిపోగా, తమ నాయకుడి మరణానికి ఆగ్రహంగా తిరగబడ్డ కార్మికుల చేతిలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు. కార్మికులకు స్ధానిక ప్రజానీకం సంఘీభావంగా ఉద్యమిస్తుండడంతో యానాంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లబడలేదని తెలుస్తోంది. కాకినాడకి ముప్ఫై కి.మీ దూరంలో ఉన్న…