కాశ్మీర్: ఇండియా అవగాహనకు దూరమౌతున్న అమెరికా!

జమ్ము&కాశ్మీర్ రాష్ట్రం విషయంలో ఇండియా అవలంబిస్తున్న అవగాహనకు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు. పశ్చిమ రాజ్యాధినేతలు దక్షిణాసియా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇండియాలో ఇండియాకు కావలసిన మాటలు, పాకిస్ధాన్ లో పాకిస్ధాన్ కు కావలసిన మాటలు చెప్పి తమ పనులు చక్కబెట్టుకొని పోవడం పరిపాటి. మొదటిసారిగా అమెరికా సెనేటర్లు కొందరు ఇండియాలో ఇండియా వ్యతిరేక అవగాహన ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది. సమస్యలు లేని చోట కూడా సమస్యలు పుట్టించి…