పిల్లలు ‘మానవ స్వరూపులు!’ -ఫోటోలు

“పిల్లలు దైవ స్వరూపులు” అని పెద్దరికం నెత్తిన వేసుకున్న పెద్దలు అంటుంటే మనం వింటుంటాం. దైవానికి లక్షోప లక్షల రూపాలు ఇచ్చుకున్న మనుషులు అందులో ఏ రూపాన్ని తమ తమ పిల్లలకు ఇచ్చుకుంటారో ఊహించడం కష్టం. ‘అసలు దైవానికి రూపం ఏమిటి? అదొక భావన’ అనేవాళ్లూ ఉన్నారు. వారు కూడా ‘పిల్లలు-దేవుళ్ళ’ సామెతను వల్లించడం కద్దు. వారి ఉద్దేశ్యంలోనేమో పిల్లలు రూపరహితులు అన్న పెడార్ధం వచ్చే ప్రమాదం ఉన్నది. ఇలా ఏ విధంగా చూసినా ‘పిల్లలు దైవ…