ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు

యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా రెచ్చగొట్టబడిన ఆందోళనలు తీవ్ర హింసారూపం దాల్చడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో రక్తం పారుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన హింసాత్మక దాడులు, ప్రతిదాడుల పర్యవసానంగా 70 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా బలగాలే భవంతులపై నుండి కాల్పులు జరపడం వలన ఆందోళనకారులు మరణించారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అసలు కీవ్ లోనే లేకపోవడం, రక్తపాత దాడులు అరికట్టడానికి యూరోపియన్ దేశాల నేతలు కుదిర్చిన…

రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…