ఎ.పి బడ్జెట్: నేల విడిచి సాము -1

విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నేల విడిచి సాము అనడం చిన్నమాట. విభజన వల్ల ఎంతో నష్టపోయామని తెలుగు దేశం ప్రభుత్వ మంత్రులు, నాయకులు ఇప్పటికీ కన్నీళ్లు పెట్టడం మానలేదు. భారీ మొత్తంలో రెవిన్యూ ఆదాయం కోల్పోయామని, హైద్రాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్లనే ఈ నష్టం సంభవించిందని చెబుతూనే 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు రు. 1,11,824 కోట్ల బడ్జెట్ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది కాకుండా…