మంచు ఖండంలో నిత్యాగ్నిహోత్రం ‘మౌంట్ ఎరేబస్’ -ఫొటోలు
క్షణమాత్రంలో ఎర్రని మంటను సైతం శ్వేతశిల గా మార్చగలిగే అంటార్కిటికా వాతావరణంలో నిత్యాగ్నిహోత్రంలా జ్వలించే అగ్నిపర్వతం ‘మౌంట్ ఎరేబస్.’ అంటార్కిటికా లో ‘మౌంట్ సిడ్లే’ తర్వాత ఇదే ఎత్తయినది. శాశ్వత లావా సముద్రం కలిగిన పర్వతంగా ‘మౌంట్ ఎరేబస్’ ప్రాముఖ్యత పొందింది. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ లో భాగమే మౌంట్ ఎరేబస్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రింగ్ లో ఇంకా 160 చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని ‘నేషనల్ జాగ్రఫిక్’ వెబ్ సైట్ తెలిపింది.…