పుండు మీద కారం, మోడీ సర్వే!

  ప్రజల అభిప్రాయానికి విలువ లేదు. సామాన్య ప్రజల కష్టాల పట్ల సానుభూతి లేదు. వ్యతిరేక అభిప్రాయం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో విరుద్ధ అభిప్రాయాలకు స్ధానం ఇవ్వాలన్న జ్ఞానమే లేదు. నోట్ల రద్దు వల్ల కలిగే ప్రభావంపై ముందస్తు అంచనా లేదు, అధ్యయనం అసలే లేదు. కనీసం ఏర్పాట్లు లేవు. కోట్లాది మంది శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి పారేసి నల్ల “ధనంపై పోరాటం” అని ప్రకటిస్తే జనం ఏమై పోతారన్న…