వర్షాలు లేవు గానీ… -కార్టూన్

వర్షాలు లేవు గానీ ఎన్నికల పుణ్యాన వాగ్దానాలు వరదై పారుతున్నాయి. హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బి‌జే‌పి నేత నరేంద్ర మోడి ఎన్ని వాగ్దానాలు కురిపించారో గుర్తుందా? విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమ చేయిస్తాం. ‘నేషనల్ రూరల్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్’ ద్వారా గ్రామాలకు టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్ కేర్ వసతి…