ఢిల్లీ: సామాన్యుడి దెబ్బకు దిమ్మ తిరిగింది!

ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు…

బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ని ఇంకా వదలడం లేదు. మోడి సృష్టించారని చెబుతున్న సుడిగాలికి లాలూ, కాంగ్రెస్ కూటమితో పాటు అధికార పార్టీ కూడా కుదేలు కావడం ఒక విషయం కాగా ప్రభుత్వంలో పుట్టిన ముసలం మరో సంగతి. ఘోరమైన ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం కాస్తా పాలనా సంక్షోభంగా మారిపోయింది. నితీష్ కుమార్ రాజీనామాను బి.జె.పి మిత్రుడు, లోక్ జన శక్తి పార్టీ…

మోడి గాలి ఉన్నట్టా లేనట్టా? -కార్టూన్

“హుర్రే… ‘మోడి గాలి లేదు’ గాలి వీస్తోందోచ్…” – గాలి పలు విధాలు. తూర్పు గాలి, పడమటి గాలి… ఇలా వీచే దిశ, కాలాల్ని బట్టి గాలి కలిగించే ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. పడమటి గాలిని మనం భరించలేం. సముద్రం మీది నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుందనుకుంటాం. కానీ అది మోసుకొచ్చే ఉప్పు నీటియావిరి జిడ్డుని అంటగడుతుంది.  దానితో చల్లదనం అటుంచి దేహం చిరచిరలాడుతుంది. ఈ గాలి లాగానే ఎన్నికల గాలులు కూడా పలు…