అవున్నిజం, మోడి గంగ అంత నిర్మలుడు!

భూకంపం పుట్టిస్తానన్న రాహుల్ గాంధీ అన్నంత పని చేయలేకపోయారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో బహిరంగ సభ జరిపి ఆయన పాల్పడిన వ్యక్తిగత అవినీతి గురించి చెప్పడం ద్వారా ఎన్నడో చేయాల్సిన పనిని కనీసం ఇప్పుడన్నా చేశారు. గుజరాత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రధాన మంత్రి సొంత జిల్లా మెహసానాలో ఆయన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడి, ముఖ్య మంత్రిగా…

మోడి అవినీతి బైటపెడతా -రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ తన వద్ద ఒక రహస్యం ఉన్నదని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఆ రహస్యాన్ని చెప్పేస్తానేమో అన్న భయంతో తనను లోక్ సభలో అధికార పక్ష సభ్యులు మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న రహస్యం “మోడి వ్యక్తిగతంగా పాల్పడిన అవినీతికి సంబంధించినది” అని ఆయన ఈ రోజు చెప్పారు. పార్లమెంటులో, ముఖ్యంగా లోక్ సభలో ఎవరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదో అర్ధం కాకుండా…

డీమానిటైజేషన్ గాలిలో కొట్టుకుపోయిన మోడీ అవినీతి?!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన అంశంపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు లేఖ రాసిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ ‘డీమానిటైజేషన్’ ప్రకటించిన సంగతి ఎంతమందికి తెలుసు? ప్రశాంత్ భూషణ్ ఎవరో తెలియనివారు / గుర్తులేనివారు ఓసారి 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కుంభకోణాలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడానికి ప్రధాన కారకుడే ప్రశాంత…