ఇండియా, అమెరికాలు సహజ మిత్రులు! -కార్టూన్

అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి తన అదృష్టానికి తాను ఎంతో మురిసిపోయినట్లు ఆయన ప్రకటనల ద్వారా తెలిసింది. ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడిని కలిసే అవకాశం తనకు వచ్చిందని మోడి చెప్పుకున్నారు. తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికాయే ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే, తనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికిందని ఈ మాటల ద్వారా మోడి ఎత్తి చూపారని చెబుతున్నవారూ లేకపోలేదు. అమెరికా…

మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు. భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు…

అమెరికా వ్యాపారులకు మోడి మీద అనుమానాలు!

తాను చెబుతున్నట్లుగా ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడికి గల నిబద్ధతపై తమకు అనుమానాలు ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు తమ అధ్యక్షుడు బారక్ ఒబామాకు మొర పెట్టుకున్నారు. మోడి ప్రభుత్వం పైకి తాము వ్యాపార వర్గాలకి అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఆచరణలో భిన్న చర్యలు తీసుకుంటోందని యు.ఎస్.ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు మరో 15 వ్యాపార సంఘాలు ఒబామాకు ఫిర్యాదు చేశాయి. మోడి వస్తున్నారు గనుక ఒత్తిడి…