అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్
ఇజ్రాయెల్ ఎంబసీ కారుపై బాంబు దాడి జరిగిన కేసులో నిందితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ ‘మొస్సాద్’ అనుమతించారన్న ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. “అనుమానితుడు మనిషి, ఆస్తి కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిందితుడిని విచారించినవారి జాబితాను తన ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితుడిపై జరిపిన విచారణపై తక్షణం ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ స్ధాయికి తగ్గని పోలీసు అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. “ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పందిగా నిందితుడిని మార్చారన్న”…