గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4

మూడో భాగం తరువాయి………………… – గ్రీసు పెట్టుబడిదారుల దుస్సాహసం 20వ శతాబ్దం ఆరంభంలో టర్కీ సామ్రాజ్యం బలహీనపడడం, మార్కెట్ల పంపిణీలో వైరుధ్యాలు తలెత్తిన ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య కుమ్ములాటలు తీవ్రం కావడంతో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తనను తాను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ బూర్జువాల మద్దతుతో టర్కీ ఆర్మీలోని రెండవ శ్రేణి సైనికాధికారులు ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ఆరంభించి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వారి చర్యలు టర్కీ జాతీయవాదాన్ని…

రక్తం పారిన ఎర్రెర్రని నేలలు, సముద్రాలు -ఫోటోలు

‘ఎరుపంటే ఎందుకురా భయం భయం! పసి పిల్లలు మీకంటే నయం నయం!! కలం వెంబడి అచ్చంగా నిప్పులు కురిపించిన చెరబండరాజు గారి ఓ కవితలోని పాదాలివి. ఇంధ్ర ధనుస్సులో ఎరుపు రంగు ఆ చివరన ఉంటుంది. ఎరుపు రంగు కిరణానికి తరంగ దైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) మిగిలిన ఆరు రంగులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అందువలన ఎరుపు రంగు తీక్షణత ఎక్కువ. ఆ కారణం వల్ల పసి పిల్లలు ఎరుపు రంగుకి ఇట్టే ఆకర్షితులు అవుతారు. రక్తం…

1 వరల్డ్ వార్: జల యుద్ధం -ఫోటోలు

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పత్రికలు ఆ నాటి యుద్ధ రీతులను చర్చలోకి తెస్తున్నాయి. ఈ యుద్ధం సందర్భంగానే జల తల యుద్ధానికి ఎనలేని ప్రాముఖ్యత వచ్చి చేరింది. అనేక కొత్త కొత్త యుద్ధ నావల ప్రాధమిక రూపాలు మొదటి ప్రపంచ యుద్ధంలో వాడుకలోకి తెచ్చారు. ఆనాటికి నౌకా బలగంలో బ్రిటన్ పెట్టింది పేరు. నావల ద్వారానే ఖండాంతరాలకు ప్రయాణం కట్టి వ్యాపారం పేరుతో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల…

మొదటి ప్రపంచ యుద్ధం: యుద్ధ విమానాలు -ఫోటోలు

యుద్ధ విమానాలతో యుద్ధం చేసుకోవడం మొదటి ప్రపంచ యుద్ధంలోనే మొదలయింది. అప్పటికి విమానాల నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలా ప్రాధమిక స్ధాయిలోనే విమానాల నిర్మాణం ఉన్నప్పటికీ శత్రువుపై పై చేయి సాధించడానికి పశ్చిమ దేశాలు వాటినీ వదల్లేదు. ప్రారంభంలో కేవలం గూఢచర్యానికి మాత్రమే విమానాలను, ఇతర ఎగిరే వస్తువులను (బెలూన్లు, గాలిపటాలు మొ.వి) వినియోగించేవారు. యుద్ధం తీవ్రం అయ్యేకొద్దీ అవసరం రీత్యానే బాంబర్లు, ఫైటర్ విమానాలు తయారు చేసుకుని వినియోగించారు. దాడులకు…

మొదటి ప్రపంచ యుద్ధంలో జంతువులు -ఫోటోలు

ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఞానం అనూహ్య స్ధాయిలో విస్తరించడం వలన అసలు మనిషే లేని ‘మానవ రహిత’ డ్రోన్ విమానాలు వచ్చాయి గానీ అప్పుడు ఇవన్నీ ఎక్కడివి? గత శతాబ్దంలో కనీసం మూడో దశాబ్దం వరకు వివిధ యుద్ధాల్లో జంతువుల పాత్ర వెలకట్టలేనిది. వెలకట్టలేని పాత్రను జంతువులు నిర్వహించాయని చెబితే అది నిజానికి చాలా సాత్వికంగా చెప్పినట్లవుతుంది. అసలు జరిగిందేమిటంటే అంతులేని మానవ హింస, వినాశనంతో పాటు జంతువుల, పక్షుల హింస మరియు వినాశనం కూడా. గుర్రాలను యుద్ధాల్లో…