శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ…

శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల…