పన్నులు ఎగవేయడమే కార్పొరేట్ నీతి!

బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు సంక్షోభ కాలాల్లో కూడా లాభాలు ఎలా సాధిస్తాయి? డబ్బు లేదు మొర్రో అంటూ ప్రభుత్వాలు అప్పుల మీద అప్పులు తెచ్చేది ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర్నుండే. దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని నిర్వహించే ప్రభుత్వం దగ్గర లేని డబ్బు పెట్టుబడిదారీ కంపెనీలకు ఎక్కడి నుండి వస్తుంది? కార్మికుల వేతనాలనూ, సౌకర్యాలను నానాటికీ కుదిస్తూ లాభాలు పోగేసుకోవడం కంపెనీల ప్రధాన మార్గం. లాభాలు పోగేసుకోవడంలో వాటికి ఉన్న రెండో ప్రధాన మార్గం పన్నులు ఎగవేయడం.…

గూగుల్ మోసాలను కట్టడి చేయండి -మైక్రోసాఫ్ట్, ఒరకిల్ ఫిర్యాదు

వినియోగదారుల ప్రైవసీని ఉల్లంఘించి సొమ్ము చేసుకుంటున్న గూగుల్ చర్యలను కట్టడి చేయాలని 17 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల గ్రూపు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) కి ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల మార్కెట్ లో అవాంఛనీయ పద్దతుల్లో తన ఉత్పత్తులకు మార్కెట్ చేసుకుంటూ పోటీకి, సరికొత్త ఆవిష్కరణలకు ఆటంకంగా గూగుల్ పరిణమించిందని పదిహేడు కంపెనీల కన్సార్టియం ‘ఫెయిర్ సెర్చ్’ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మైక్రో సాఫ్ట్ కంపెనీ గూగుల్ కంపెనీ పై మళ్ళీ…