తిరుగుబాటు ముందువరకూ గడ్డాఫీ అమెరికాకి మిత్రుడే -వికీలీక్స్

ప్రస్తుతం లిబియా రాజధాని ట్రిపోలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల సైన్యాలతూ కూడిన నాటో దళాలు మౌమ్మర్ గడ్డాఫీ కోసం వేటాడుతున్నాయి. గడ్డాఫీ నమ్మకస్తులనుకున్నవారి ఇళ్లపై బడి గడ్డాఫీకోసం వెతుకులాట పేరుతో దారుణ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ‘వేటాడి చంపవలసినవాడు’ గా అమెరికా ప్రకటించిన కల్నల మౌమ్మర్ గడ్డాఫీ నిజానికి తిరుగుబాటు పేరుతో అంతర్యుద్ధం ప్రారంభమయ్యే వరకూ అమెరికా కు అనుంగు మిత్రుడే. ఆ మేరకు రిపబ్లికన్ సెనేటర్లతో పాటు, బుష్ అధికార బృందంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా…