ఇండియా బ్యాంకుల రేటింగ్ తగ్గించిన ‘మూడీస్’

‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్’ సంస్ధ భారత దేశ బ్యాంకింగ్ వ్యవస్ధ రేటింగ్ తగ్గించింది. ‘స్ధిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) రేటింగ్ కు తగ్గించింది. భారత దేశ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, ఆస్తుల క్వాలిటీ విదేశాల్లో దెబ్బతినడం, బ్యాంకుల పెట్టుబడీకరణ, లాభదాయకత దెబ్బతినడం రేటింగ్ తగ్గించడానికి కారణాలుగా మూడీస్ పేర్కొంది. ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకోవడం, ప్రభుత్వం అధికంగా అప్పులు తెచ్చుకోవడం వల్ల ప్రవేట్ క్రెడిట్ మార్కెట్ లో నిధుల లభ్యతను తగ్గించివేస్తుందనీ దానివల్ల ప్రవేట్ అప్పు…

జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం

క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఆర్ధిక పరిణామాలను అధారం చేసుకుని మాత్రమే రేటింగ్ ఇవ్వవలసి ఉండగా, రాజకీయ పరిస్ధితుల ఆధారంగా కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లుంది. ఎడతెగని రాజకీయ సంక్షోభం రీత్యా జపాన్ క్రెడిట్ రేటింగ్ ను ఒక మెట్టు తగ్గించింది. జపాన్ లో గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధానులు పని చేశారు. ఇప్పటి ప్రధాని కూడా ఆగస్టు నెలాఖరుకు పదవు నుండి తప్పుకోబోతున్నాడు. భూకంపం, సునామీలకు సమర్ధవంతంగా, వేగంగా స్పందించడంలో విఫలమైనాడని అందరూ భావిస్తుండడంతో…

అమెరికా అప్పు రేటింగ్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటింగ్ సంస్ధలు

ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న అమెరికా సావరిన్ అప్పు రేటింగ్‌ను తగ్గించడానికి ప్రపంచంలోని టాప్ రేటింగ్ సంస్ధలు మూడూ సిద్ధంగా ఉన్నాయి. స్టాండర్డ్ & పూర్స్ (ఎస్ & పి), ఫిచ్, మూడీస్ లు ప్రపంచ రేటింగ్ సంస్ధల్లో మొదటి మూడు సంస్ధలుగా పేరు పొందిన రేటింగ్ సంస్ధలు. ఇవి ఆయా దేశాల సావరిన్ అప్పు బాండ్లకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా వివిధ ద్రవ్య సంస్ధలు, బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు తదితర…

చైనా బ్యాంకుల్లో పేరుకుపోయిన తిరిగి రాని అప్పులు $0.5 ట్రిలియన్లు -మూడీస్ హెచ్చరిక

చైనా బ్యాంకుల్లో తిరిగి రాని అప్పులు పేరుకుపోయాయనీ, అవి అలానే కొనసాగితే చైనా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ తగ్గించాల్సి ఉంటుందని మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. 2008లో ఆర్ధిక సంక్షోభం సంభవించినపుడు, దాని బారిన పడకుండా ఉండడానికి చైనా పెద్ద ఎత్తున బెయిల్ ప్యాకేజీని అమలు చేసింది. బెయిలౌట్ ప్యాకేజితో పాటు దేశంలోపల విచ్చలవిడిగా అప్పులు మంజూరు చేసింది. ఉత్పత్తి కార్యక్రమాలకు బదులుగా వినియోగ సరుకులైన కార్లు, టి.విలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయడానికి అప్పులు…

అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా దివాళా ఖాయం -మూడీస్

రిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు అమెరికా అప్పు పరిమితి పెంచే విషయంలో త్వరగా ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా దివాళా ఖాయమని మూడీస్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉందనీ, ఇరు పార్టీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలనీ లేకుంటే ఇపుడున్న టాప్ రేటింగ్ కోల్పోవాల్సి ఉంటుందనీ ఆ సంస్ధ హెచ్చరించింది. ప్రస్తుతం ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా అమెరికా ప్రభుత్వం సేకరించగల అప్పుపై 14.3 ట్రిలియన్ డాలర్ల మేరకు…

గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని…