రష్యన్ ఎంబసీపై దాడి, మాట నిలబెట్టుకున్న అమెరికా?
అమెరికా తన మాట నిలబెట్టుకుంది. “మీ ఇళ్లకు మీ వాళ్ళ శవాలు వెళ్తాయి” అని అమెరికా విదేశాంగ శాఖ చేసిన హెచ్చరిక ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. సిరియా రాజధాని డమాస్కస్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పైన సోమవారం ఆల్-నుస్రా టెర్రరిస్టులు దాడి చేశారు. దాడిలో రష్యన్ ఎంబసీ సిబ్బంది ఎవరు గాయపడలేదని రష్యా తెలిపింది. ఎంబసీ భవనం మాత్రం దెబ్బ తిన్నదని చెప్పింది. “అక్టోబర్ 3 తేదీన రష్యన్ రాయబార కార్యాలయం మోర్టార్…