5 ని.ల్లో రద్దు బిల్లు మూజువాణి ఆమోదం, నోటితో నవ్వుతూ…
పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమ నిబంధనలు, నియమావళి, సుస్ధిర ప్రక్రియలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల పార్లమెంటరీ ఆచరణలో తామే నెలకొల్పుకున్న సో-కాల్డ్ ప్రజాస్వామిక సభా సూత్రాలు రద్దయిపోతూ వాటి స్ధానంలో పార్లమెంటరీ నియంతృత్వ సూత్రాలు ప్రవేశిస్తున్నాయి. ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులు నిరసనలను గౌరవించడం మాట అటుంచి కనీసం పట్టించుకోవడమే ఒక గొప్ప అంశంగా మారే రోజులు వచ్చాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా ఇన్నాళ్లూ మన పాలకులు డప్పు కొట్టుకున్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు…