మూజువాణి ఓటు అంటే?

శ్రీవిద్య: మీ సైట్ పాఠకుల్లో నేనొకరిని. సైట్ నాకు ఉపయోగంగా ఉంది. నా మొదటి ప్రశ్న-   ఇటీవల వార్తల్లో “మూజువాణి ఓటు” అని తరచుగా కనిపిస్తోంది… అంటే ఏమిటి? ఇటువంటి ఓటుతో ఇంతకుముందు ఏమన్నా ఇటువంటి తీర్పులు జరిగాయా? సమాధానం: మూజువాణి ఓటు అని పత్రికల్లో చదవడమే గానీ అదేమిటో చాలా మందికి తెలియదు. అడిగినా చెప్పేవారు తక్కువే ఉంటారు. వాణి అంటే గొంతు, పలుకు అని అర్ధం అని తెలుసు గనక అదేదో అరిచి చెప్పే…