ఏ రాయయితేనేం… పళ్లూడగొట్టుకోడానికి? -కార్టూన్

రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలి? ప్రజలను ఎటువంటి వివక్ష లేకుండా పాలన చేయడం అటుంచి వారి మానాన వారిని బతకనిచ్చే పార్టీలు ఇండియాలో ఏమున్నాయని? వనరులన్నీ విదేశీ కంపెనీలు తరలించుకుపోతున్నా నోరు మూసుకున్నందుకు కాళ్ళ కింద భూమిని కూడా ఇప్పుడు లాక్కుపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోయినా చిల్లర కొట్టు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకుంటే దాన్ని తీసుకుపోయి వాల్ మార్ట్ కి అప్పజెపుతున్నారు. ఇన్ని చేసినా సహించి ఊరుకుంటే నువ్వు ముస్లింవి కనుక చంపుతాను అని ఒకరోస్తే,…

నరేంద్ర మోడిపై ఛార్జి షీటు దాఖలుకు పుష్కల అవకాశాలు

గుజరాత్ మారణకాండలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి జాకియా జాఫ్రి కేసులో నిజా నిజాలను వెల్లడించడానికి సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ ‘రాజు రామచంద్రన్’ నివేదిక పుణ్యమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపైన ఛార్జి షీటు దాఖలు చేసి విచారించడానికి అవకాశాలు పెరిగాయి. అమికస్ క్యూరి నివేదికలో పొందుపరిచిన వివరాల ఆధారంగా 2002లో జరిగిన ముస్లింల మారణకాండకు బాధ్యుడిగా నరేంద్రమోడిపైన ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం తగిన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. నివేదిక ఇంకా రహస్యంగా ఉన్నప్పటికీ…