ఎస్.పిలో విభేదాలు ఒట్టి డ్రామా -అమర్ సింగ్

కలుగులో ఎలుక బైటికి వచ్చేసింది. మాంత్రికుడి మేజిక్ రహస్యం మేజిక్ మధ్యలో ఉండగానే బద్దలైంది. మాంత్రికుడికి సహకరించవలసిన ఓ పాత్రధారి ఏ కారణం చేతనో అసంతృప్తి చెందడంతో నాటకం అంతా బట్టబయలైంది. సమాజ్ వాదీ పార్టీ నుండి గతంలో వెళ్లగొట్టబడి ఎన్నికల ముందు తిరిగి ఆహ్వానం అందుకున్న అమర్ సింగ్ ములాయం-అఖిలేష్ ల నాటకాన్ని బైట పెట్టాడు. “ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన రాజకీయ దుమారం అంతా ముందుగానే అనుకున్న ఒక…

సి.బి.ఐ కేసు కంచికి, ములాయం యు.పి.ఎ గూటికి

సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు మరియు యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై జరుగుతున్న అక్రమ ఆస్తుల కేసు విచారణ మూసివేత దిశలో ప్రయాణిస్తున్నదని పత్రికలు ఘోషిస్తున్నాయి. అదే సమయంలో ములాయం పార్టీ యు.పి.ఎ కూటమిలోకి ప్రయాణం చేస్తున్నదని కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పరిణామాలకు ఎంత గాఢమైన అనుబంధం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ములాయం, అఖిలేష్…

రెక్కలు కట్టుకుంటే మాత్రం ఎగరగలమా? -కార్టూన్

రైట్స్ సోదరులు విమానం కనిపెట్టక ముందు మనిషి గాలిలో ఎగరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు ఉత్సాహపరులు పక్షి రెక్కల లాగా అట్టలతో రెక్కలు తయారు చేసుకుని చేతులకు కట్టుకుని కొండలపైకి ఎక్కి దూకడం కూడా చేశారట. అలాంటివారు అనేకమంది చనిపోగా మరి కొందరు వికలాంగులు అయ్యారని చిన్నప్పుడు చదువుకున్నాం. భారత దేశంలో ధర్డ్ ఫ్రంట్ కోసం ములాయం సింగ్ చేస్తున్న ప్రయత్నాలను అలా రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగరాలని ప్రయత్నించడంగా కార్టూనిస్టు పోల్చారు. రెక్కలు కట్టుకుని…