బ్యాట్స్ మేన్, రన్నర్ ఇద్దరూ ఆయనే -కార్టూన్

బి.సి.సి.ఐ భారత ప్రభుత్వ సంస్ధ అని చాలామంది భావిస్తారు. అది కేవలం ప్రైవేటు క్రికెట్ సంఘాలను కేంద్రీకృత స్ధాయిలో నియంత్రించే ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వారికి తెలియదు. అనేక యేళ్లుగా భారత ప్రజల్లో క్రికెట్ జ్వరాన్ని పెంచి పోషించి ఆ జ్వరాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బి.సి.సి.ఐ అవతరించింది. బి.సి.సి.ఐని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కొన్ని సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ క్రికెట్ జబ్బు డబ్బు తినడం మరిగిన సంపన్నులు…