రోహిత్ నిరసనకు దారి తీసిన DU ఘటన -వీడియో

రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్ధితుల్లో మొదటిది ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన అని పత్రికలు, ఛానెళ్ల ద్వారా తెలిసిన విషయం. ఆ ఘటనకు సంబంధించిన వీడియోయే ఇది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజీలో గత ముజఫర్ నగర్ మత కొట్లాటలపై ఒక డాక్యుమెంటరీ (ముజఫర్ నగర్ బాకీ హై) ప్రదర్శిస్తుండగా ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘం వాళ్ళు దాడి చేసి ప్రదర్శన నిలిపివేయించారు. ఆ డాక్యుమెంటరీ ‘యాంటీ నేషనల్’ అన్న ఆరోపణతో…

దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!

ది హిందు సంపాదకీయం చివరలో పేర్కొన్న ‘నిరాకరణ నేరం’ అప్పుడే జరిగిపోయింది కూడా. విద్యార్ధుల ఆత్మహత్యకు తన లేఖలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా నిరాకరణ జారీ చేసేశారు.  ఒక్క బండారు మాత్రమే కాదు, బి‌జే‌పి జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ యూనివర్సిటీ సందర్శనను ఖండిస్తూ పనిలో పనిగా “రోహిత్ దళితుడు కావడానికీ, అతనిని సస్పెండ్ చేయడానికి ఎలాంటి సంబంధమూ లేదు”…

అజిత్ సింగ్: ఎడారి సేద్యగాడు -కార్టూన్

– “సారవంతమైన రాజకీయ వారసత్వం ఇంతగా సాగుకు వీలు కానిదిగా ఎలా మారిపోయింది చెప్మా?” ********* ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును! ఈ సామెతలోని మొదటి అర్ధ భాగానికి మరో చక్కని ఉదాహరణ ఉత్తర ప్రదేశ్ రాజకీయ నేత అజిత్ సింగ్. ఒకప్పటి లోక్ దళ్ పార్టీ నేత, జనతా హయాంలో చక్రం తిప్పిన చౌదరి చరణ్ సింగ్ తనయుడు అయిన అజిత్ సింగ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో నిన్నటి వరకు తిరుగులేని నేత. జాట్…

(మత) ఆకర్షక రాజకీయాలు -ది హిందు ఎడిటోరియల్

ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి…

యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?

ఉత్తర ప్రదేశ్ లో మరొకసారి మత విద్వేషపు మంటలు రగిలాయి. కాదు, రగల్చబడ్డాయి. బి.జె.పి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. జరిగిన సంఘటనలు కూడా ఆ వాదనను నిజం చేస్తున్నాయి. బి.కె.యు అనే రైతు సంఘం నిర్వహించిన భారీ బహిరంగ సభలో బి.జె.పి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే భారీ సంఖ్యలో (ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని…