ముంబైకి రిలయన్స్ ఎగేసిన బాకీ రు 1577 కోట్లు!

ముంబై మునిసిపాలిటీకి ఐదేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ చెల్లించవలసిన బాకీని చెల్లించని ఉదంతం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్మెంట్ ఆధారిటీ (ఎం‌ఎం‌ఆర్‌డి‌ఏ) కి చెందిన రెండు స్ధలాలను లీజుకు తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, లీజు ద్వారా తలెత్తిన చెల్లింపులను ఎగవేసినట్లు లేదా ఇంతవరకు చెల్లించనట్లుగా ఒక ఆర్‌టి‌ఐ కార్యకర్త వెల్లడి చేశాడు. అక్రమ కట్టడం పేరుతో, ఆక్రమణ పేరుతో పేదల గుడిసెలను పెద్ద ఎత్తున తొలగించి…

ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది…

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు! సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా? అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్…

రిలయన్స్-మంత్రుల్ చెట్టపట్టాల్ -కార్టూన్

కేశవ్ గారి మేజికల్ అప్పీల్ కి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? భారత దేశ రాజకీయ నాయకులు ఈ దేశంలోని అత్యంత ధనికుడుగా పేరు పొందిన వ్యక్తి, రిలయన్స్ కంపెనీ అధినేత అయిన ముఖేష్ అంబానీతోనూ, ఆయన కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తోనూ పాలు-నీళ్ళు లాగా ఎంతగా కలిసిపోయారో చెప్పగల ఇలస్ట్రేషన్ ఇంతకు మించి ఉంటుందా? ఒకవేళ అర్ధం కాకపోతే ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కంపెనీ లోగోనూ, ఈ కార్టూన్ నూ పక్క పక్కనే పెట్టి చూస్తే మర్మం…