ఉత్తరఖండ్: మొట్టికాయలతో.., రాష్ట్రపతి పాలన రద్దు!

నైనిటాల్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. బహుశా అరాయించుకోలేనంత గడ్డి! అరగకపోయినా విసర్జించ వీలు కాని గడ్డి! ఒక్క రోజు కాదు, గత రెండు మూడు రోజులుగా గడ్డి పెడుతూనే ఉంది. హఠం వేసినట్లు కేంద్ర ప్రభుత్వ లాయర్లు వెర్రిమొర్రి వాదనలు చేసే కొద్దీ గడ్డి పరిమాణం పెరుగుతూ వచ్చింది. హై కోర్టు నిజానికి తన తుది తీర్పును రిజర్వ్ లో పెట్టుకుని తర్వాత ప్రకటిద్దాం అనుకుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో చేసినట్లుగానే…

రహస్య చట్టంతో నల్ల డబ్బు ఖాతాలను దాయొద్దు! -సుప్రీం

మంగళవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. నల్ల డబ్బు ఖాతాల వివరాలను దాచి పెట్టడానికి గోప్యతా నిబంధనలను (confidentiality clause) అడ్డం పెట్టవద్దని ఘాటుగా సూచించింది. నల్ల డబ్బు యాజమానుల వివరాలను వెల్లడించకుండా ఉండడానికి గోప్యతా నిబంధనలను శరణు వేడడం తగదని, ఎన్ని రహస్య నిబంధనలు ఉన్నప్పటికీ నల్ల డబ్బు ఖాతాల పేర్లన్నీ తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారిని ఏంచేయాలో తాము చూసుకుంటామని ప్రభుత్వానికి హైరానా అవసరం లేదని స్పష్టం చేసింది.…