మద్యపానం: కనీస వయసు తగ్గించిన బి.జె.పి ప్రభుత్వం

వ్యాపారాలు చేసుకోవడానికి బ్రహ్మాండమైన సానుకూల వాతావరణం ఏర్పరుస్తామని ఎన్నికలకు ముందు బి.జె.పి వాగ్దానం చేసింది. ఆ సంగతి చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడి దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. గతంలో ఏ ప్రధానీ తిరగనన్ని దేశాలు అతి తక్కువ కాలంలోనే పర్యటిస్తూ ఆయన కొత్త రికార్డుల్ని స్ధాపిస్తున్నారు కూడా. ఇలా వ్యాపారులకు సంపూర్ణ సహకారం ఇవ్వడంలో బి.జె.పి ఏలుబడిలోకి వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు పాత్రను ఘనంగా పోషిస్తున్నాయి. ముంబై నగరపు ఉత్సాహకరమైన రాత్రి…

నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!

గుజరాత్ మారణకాండ అనంతరం ముస్లిం ప్రజలు రక్షణ కోసం వెలివాడల్లో బ్రతుకులు ఈడ్చవలసిన దుర్గతి దాపురించింది. ఇటువంటి హీన పరిస్ధితుల మధ్య బతకలేక కాస్మోపాలిటన్ నగరం ముంబైలో గౌరవంగా బతకొచ్చని గంపెడు ఆశలతో తరలి వచ్చిన ముస్లింలకు ఆధునిక కాస్మోపాలిటన్ సంస్కృతికి బదులు మత విద్వేషం స్వాగతం పలికింది. ఆధునిక నగరం అని జనులు చెప్పుకునే ముంబై నగరం పైకి మాత్రమే ఆధునికం అనీ లోలోపల కుల, మత, లింగ వివక్షలతో కుళ్లిపోయిందని మిష్భా ఖాద్రి అనుభవం…

నువ్వు ముస్లింవి.. ఉద్యోగం ఇవ్వం ఫో!

సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల్లో ఒక కులం వారికి తప్ప ఉద్యోగం ఇవ్వరు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఇప్పటికీ ఆ కులం వారికే ఎక్కువ ఉద్యోగాలు దక్కడం ఒక చేదు నిజం. దేశంలో దళితులకు దూరం నుండి నీళ్ళు వొంచి పోసే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వని మురికి మనసుల కుటుంబాలు ప్రతి పల్లె, పట్టణంలోనూ ఉన్నాయి. ముంబైలో ముస్లింలకు కూడా ఇళ్ళు అద్దెకు లభించవు. ఇప్పుడు అదే ముంబైలో పేరు మోసిన…

గొర్రెని చూసి పులి చారల్ని చెరిపేసుకున్నట్లు…

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అని సామెత! కానీ పులులకు పాడుకాలం దాపురించింది. పులుల వైభోగం చూసి నక్కలు వాటిని అనుకరించడానికి బదులు గొర్రెల వైభోగానికి పులులే ఈర్ష్య పడాల్సిన చేటుకాలం దాపురించింది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎం.పిలే రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం మనం ఎరుగుదుమా? ఎఎపి అనే గొర్రె ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి విద్యుత్ ఛార్జీల్ని సగానికి తగ్గించేయడంతో…

ముంబై: జలాంతర్గామి పేలుడు, మునక -18 మంది మరణం?

భారత నౌకాదళం బుధవారం తెల్లవారు ఝాము భారీ మూల్యం చెల్లించింది. సంప్రదాయక సబ్ మెరైన్ లో పేలుడు సంభవించి ముంబై డాక్ యార్డ్ లో మునిగిపోవడంతో 18 మంది నావికాదళ సభ్యులు చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సింధూరక్షక్’ అనే పేరుగల ఈ జలాంతర్గామును రష్యా సరఫరా చేసింది. కిలో క్లాస్ యుద్ధనౌకగా భావించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళంలో ఒక ముఖ్య భాగం అని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన…