అదే ఘోరం, అదే క్రూరత్వం, ఈసారి ముంబై

డిసెంబరు 16 నాటి ఢిల్లీ అత్యాచారం విషయంలో నిందితులపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా పని చేస్తున్నాయో లేదో గానీ అత్యాచారాల వేగం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఢిల్లీ బస్సు అత్యాచారం తరహాలోనే ఒక ఫోటో జర్నలిస్టు యువతి పైన ఐదుగురు మృగాళ్ళు పైశాచిక రీతిలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటనలో కూడా యువతి బాయ్ ఫ్రెండ్ ని దుండగులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలు…