అజ్మల్ కసబ్ ఉరి శిక్ష అమలు
26/11 గా ప్రస్తావించే ముంబై మారణహోమంలో పాల్గొన్న అజ్మల్ కసబ్ ను ఉరి తీశారని పత్రికలు తెలిపాయి. కసబ్ ఉరితీతను మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ధృవీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. మారణ హోమానికి నాలుగు సంవత్సరాలు నిండడానికి ఐదు రోజులకు ముందు అజ్మల్ కసబ్ ఉరికంబం పై శిక్ష అనుభవించాడు. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబరు 8 తేదీన తిరస్కరించడంతో కసబ్ ని ఉరి తీయడానికి ఉన్న…