చైనా బులెట్ ట్రైన్ మనకు సాకారం అయ్యేనా?

భారత దేశంలో అతి పొడవైన మార్గంలో బులెట్ ట్రైన్ రైలు, ట్రాక్ నిర్మించాలని చైనా భావిస్తోంది. కానీ జపాన్ ఇస్తున్న పోటీ వల్ల చైనా ఇవ్వజూపుతున్న సహాయం వెనక్కి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ చొరబడడంతో మెక్సికోలో బిడ్డింగ్ పూర్తయిన బులెట్ ట్రైన్ ప్రాజెక్టు సైతం చైనా చేజారడంతో ఇండియాలోనూ అదే జరగవచ్చని చైనా అనుమానిస్తోంది. ఇండియా మాత్రం అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకుని చైనా అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇండియాకు చెందిన ‘హై స్పీడ్ రైల్…