మహిళా పోలీసుకే ధైర్యం లేకపోతే నాకెలా ఉంటుంది –ఫోటో జర్నలిస్టు
(ముంబై ఫోటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం పట్ల టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో జర్నలిస్టు ఉమా కదం స్పందన ఇది. ది హిందు పత్రిక దీనిని ప్రచురించింది. ఉమా కదం గత 13 యేళ్లుగా టైమ్స్ గ్రూపులోని వివిధ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు.) నేను ఫోటో జర్నలిస్టుగా నా కెరీర్ ని 2001లో ప్రారంభించాను. అప్పట్లో నగరంలో ఉన్న అతి కొద్దిమంది మహిళా ఫోటోగ్రాఫర్లలో నేను ఒకరిని. మొదటి రెండు లేదా మూడు…