అమెరికా పోలీసు హింస: అంతర్జాతీయ విచారణకు డిమాండ్

మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ పట్టణంలో తెల్లజాతి పోలీసు ఒకరు, యువ నల్లజాతి పౌరుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి చంపడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసుల అణచివేత సైతం తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. పట్టణంలో ఎవరినీ ఒక చోట నిలబడనీయకుండా పోలీసులు తరిమి కొడుతున్నారు. నేషనల్ గార్డ్ బలగాలు పట్టణంలో దిగి మిలట్రీ తరహా పాలనను అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఫెర్గూసన్ లోని పోలీసు, మిలట్రీ హింసపై విచారణ చేయడానికి అంతర్జాతీయ కమిషన్ ను నియమించాలని…