రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా

అమెరికా నేతృత్వం లోని మిలటరీ గూండా కూటమి నాటో (North Atantic Treaty Organisation) కు తమ దేశంలో మిసైల్ స్ధావరం కల్పించడంపై రష్యా నోరు విప్పింది. అనవసరంగా నాటో యుద్ధోన్మాదంలో బలి పశువు కావొద్దని హితవు పలికింది. అమెరికన్ యాంటీ మిసైల్ వ్యవస్ధను తమ దేశంలో నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడం తగదని, తమ రక్షణ కోసం అమెరికా మిసైల్ వ్యవస్ధపై చేసే దాడి రుమేనియాపై దాడిగా మారుతుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరురుపరుచుకునే…

అమెరికా ఎన్.ఎం.డిని ఛేదించగల చైనా హైపర్ సోనిక్

అమెరికా అభివృద్ధి చేసుకున్న మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడును చైనా తాజాగా పరీక్షించింది. శబ్ద వేగానికి 10 రెట్ల వేగంతో ప్రయాణించగల హైపర్ సోనిక్ మిసైల్ అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడు కావడం దాని వేగం వల్లనే. దూసుకు వచ్చే మిసైళ్లను మధ్యలోనే కనిపెట్టి దానిని గాలిలోనే మరో మిసైల్ తో ఎదుర్కొని మట్టి కరిపించే వ్యవస్ధను అమెరికా అభివృద్ధి చేసుకుంది. ఇందులో దాడికి వచ్చే మిసైల్ వేగాన్ని కనిపెట్టి, నిర్దిష్ట సమయంలో ఏ పాయింట్…