సంచలనం: అమెరికా సముద్ర జలాల్లో చైనా గూఢచార నౌక

హవాయ్ ద్వీపకల్పానికి సమీపంలో తన గూఢచార నౌకను ప్రవేశ పెట్టి చైనా సంచలనానికి తెర తీసింది. తూర్పు చైనా సముద్ర జలాల్లో దశాబ్దాల తరబడి అమెరికా సాగించిన చొరబాటు చర్యలకు ప్రతీకారంగా చైనా చర్యను అంచనా వేయవచ్చు. గోల్డ్ సీ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పెద్దగా పట్టించుకోనట్లు నటిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం మాత్రం మింగలేక అలాగని కక్కనూ లేక మౌనం పాటిస్తోంది. ఫోర్బ్స్, ఫైనాన్షియల్…