ఫేస్ బుక్ నుండి బలవంతపు అదృశ్యం -కార్టూన్

కాశ్మీర్ లోయలో యువకులు ఉన్నట్లుండి మాయం కావడం సామాన్యమైన విషయం. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ 1990ల్లో అది ఉధృతంగా జరిగింది. ఉగ్రవాదులన్న వంకతో వేలాది యువకులను భారత సైన్యం మాయం చేసింది. ఒమర్ అబ్దుల్లా పాలన కాలంలో సామూహిక సమాధులు బైట పడ్డాయి కూడా. సమాధుల చరిత్రను విచారించేందుకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు. బందిపురా, బారాముల్లా, కుప్వారా అనే మూడు జిల్లాల్లోని 55 గ్రామాల్లో సామూహిక సమాధులు బైటపడ్డాయి. 2,700 సమాధులు…

అఫ్జల్ గురు కార్టూన్ తొలగించిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ ఒక కంపెనీ. లాభార్జనే ఫేస్ బుక్ కంపెనీ ధ్యేయం. కానీ ఒక వ్యాపార కంపెనీయే రాజ్యం అవతారం ఎత్తితే?! అఫ్జల్ గురు కి వేసిన ఉరిశిక్ష సాక్షాలు బలంగా ఉండి నేరం రుజువు కావడం వల్ల కాదు. సాక్షాలు బలంగా లేకపోయినా న్యాయ స్ధానం సాక్షిగా ఉరితీయడం ద్వారా కాశ్మీర్ ప్రజలకు గట్టి సందేశం ఇవ్వాలని భారత రాజ్యం భావించినందుకు! భావాలకు సంకెళ్లు వేయగలరా ఎవరైనా? ‘రాముడు ఆ బాబ్రీ మసీదు కట్టిన చోటనే…