వీసా పోటీ: ఐరోపాకు విస్తరిస్తున్న రష్యా చెల్లింపు వ్యవస్ధ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
రష్యా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధ ఐరోపాకు విస్తరించడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. పశ్చిమ దేశాలకు ఈ రంగంలో ఇప్పటి వరకు ఆధిపత్యంలో ఉండడంతో అమెరికా, ఐరోపాలు ఆడింది ఆటగా చెల్లిపోయింది. ఈ పరిస్ధితిని మార్చే లక్ష్యంతో రష్యా, చైనాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి.  మిర్ నేషనల్ పేమెంట్ సిస్టం (మిర్ జాతీయ చెల్లింపుల వ్యవస్ధ) పేరుతొ రష్యా తన సొంత జాతీయ మరియు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్ధను…

రష్యాలో ఇక చైనా క్రెడిట్ కార్డులు

అంతర్జాతీయ ద్రవ్య రంగంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతూ రష్యా మరో నిర్ణయం తీసుకుంది. చైనా క్రెడిట్ కార్డుల సంస్ధ యూనియన్ పే కార్డులను దేశంలో వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు ప్రకటించడంతో వీసా, మాస్టర్ కార్డ్ సంస్ధల క్రెడిట్ కార్డులను రష్యా దేశం నుండి తన్ని తగలేసింది. అమెరికా ఆంక్షలను అనుసరించి కొన్ని రష్యన్ కంపెనీల ఖాతాలను వీసా, మాస్టర్ కార్డ్ లు స్తంభింపజేశాయి. అందుకు ప్రతీకారంగా చైనా…