బస్సు డోర్ లాక్ అయిపోయి రాలేదు…

(ఇది తులసి గారు తన వ్యాఖ్య ద్వారా ఇచ్చిన సమాచారం. -విశేఖర్) బస్సు పట్టాలపైకి వచ్చి నాలుగు నిమిషాలు ఆగిపోయింది. ఆ నాలుగు నిమిషాల్లో పిల్లల్ని కాపాడేందుకు డ్రైవర్, క్లీనర్ ప్రయత్నం చేశారు. ఘటన జరిగింది ఉదయం కాబట్టి రైల్వే క్రాసింగ్ వద్ద ఎవరూ లేరు. అందుకే కొత్తవాడైన డ్రైవర్ భిక్షపతి స్కూల్ కరస్పాండెంట్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ చెయ్యడమెందుకు త్వరగా పిల్లల్ని దించివేయవచ్చు కదా అను అనుమానం కలుగుతుంది. అయితే ఆ సమయంలో బస్ డోర్…

బస్సు కండిషన్ దాచి డ్రైవర్ పైకి నెట్టేశారు -ఎబిఎన్

తెలంగాణలో మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అందరూ నిర్ధారించారు. అది వాస్తవం కాదని కండిషన్ లో లేని బస్సును పక్కనబెట్టకుండా తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని స్కూలు పిల్లలను ఉటంకిస్తూ ఎ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలిసినా డ్రైవర్ పైకి తప్పు నెట్టేసి స్కూలు యాజమాన్యాన్ని కాపాడుతున్నారని తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతున్నారని, రైలు వస్తున్న సంగతి…