నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది. చైనా…