మంగళయానం విజయవంతం

భారత పత్రికల ప్రకారం భారత దేశం చరిత్ర లిఖించింది. భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రకారం మొట్ట మొదటి ప్రయత్నంలోనే ఒక ఉపగ్రహాన్ని అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొట్ట మొదటి దేశంగా భారత దేశం చరిత్రపుటలకు ఎక్కింది. 11 నెలల క్రితం నవంబర్ 5 తేదీన పి.ఎస్.ఎల్.వి -సి25 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (MOM) అనే ఉపగ్రహం ఈ రోజు (సెప్టెంబర్ 24, 2014) విజవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది.…

మార్స్ ఆర్బిటర్ నుండి మొదటి ఫోటో

మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు తలపెట్టిన అంగారక ప్రయాణంలో మొట్టమొదటి చిగురు బీజాన్ని చీల్చుకుని తొంగి చూసింది. ప్రస్తుతం భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ఉపగ్రహం భూగ్రహాన్ని ఫోటో తీసి పంపింది. భారత దేశం, దాని చుట్టుపక్కల ఉన్న భూ, సముద్ర భాగాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఉపగ్రహాలు భూమి ఫోటోలు తీసి పంపడం కొత్తేమీ కాదు. ఆ పనిని ఇస్రో ఇప్పటికే ప్రయోగించిన అనేక ఉపగ్రహాలు రోజూ చేసే పనే. అయితే…

ఎన్నికల హామీ: అంగారకుడిపై ఉచిత భూములు -కార్టూన్

– “నాకనుమానం లేదు. ఇక అంగారకుడిపైన నీరు, ఉచిత భూమి ఇస్తామని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాగ్దానాలు కురిపిస్తారు.” *         *          * భారత రాజకీయ పార్టీల హామీల వరదకు ఆనకట్ట వేయగల మొనగాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరని ఇట్టే చెప్పొచ్చు. ప్రజల్ని బిచ్చగాళ్లను చేసి పగ్గం గడుపుకోని పార్లమెంటరీ రాజకీయ పార్టీ కూడా ఇండియాలో కనపడదు. ఇందిరాగాంధి కాలంలో ఎస్.సి, ఎస్.టి ల గుడిసెలకు ఉచితంగా బొంగులు, తాటాకులు ఇవ్వడం…