క్షీణించిన ఇండియా ఫ్యాక్టరీల ఉత్పత్తి సూచిక, గ్లోబల్ అనిశ్చితే కారణం

ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ అయిన అమెరికా వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణిస్తుండం, అంతులేని యూరప్ రుణ సంక్షోభం తమ ప్రభావం చూపడంతో ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టు నెలలో తీవ్రంగా పడిపోయినట్లుగా హెచ్.ఎస్.బి.సి మార్కిట్ సర్వే లో తేలింది. ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగంలోని ఉత్పత్తి తీరుతెన్నులను సూచించే హెచ్.ఎస్.బి.సి పి.ఎం.ఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఆగస్టు నెలలో 52.6 గా నమోదయ్యింది. మార్కెట్ విశ్లేషకులు 52.9 ఉండగలదని అంచనావేయగా దాని కంటే తక్కువ స్ధాయి 52.6 నమోదైనట్లుగా…