బేయర్, మాన్ శాంటో విలీనం: మహా రాకాసి అవతరణం
రాకాసి, రాకాసి విలీనం అయితే ఏమవుతుంది? మహా రాకాసి పుడుతుంది. రెండు రాకాసులు కలిస్తే ఏ పాటి విధ్వంసం జరుగుతుంది? ఆ రాకాసులు విడి విడి గా చేయగల విధ్వంసం కంటే ఇంకా ఎక్కువగా విధ్వంసం జరుగుతుంది. ఇద్దరు పని వాళ్ళు విడి విడిగా పని చేసినప్పటి కంటే సమిష్టిగా పని చేసినప్పటి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రాకాసితనం కూడా అంతే అన్నమాట! నిజానికి బహుళజాతి కంపెనీలు విలీనయం అయేది, స్వాధీనం చేసుకునేది కూడా అలా…