నోట్ల రద్దు: రాజకీయ ప్రయోజనాలు సాధిస్తాం -బీజేపీ

  పెద్ద నోట్ల రద్దు వెనుక బీజేపీ లక్ష్యాలు తెర వెనుక నుండి మెల్లగా బైటికి వస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నల్ల ధనం, ఉగ్రవాదం, దొంగ నోట్లు, మున్నగు జబ్బుల్ని నయం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశామని మోడీ చెబుతుండగా ‘నోట్ల రద్దు’ వల్ల వచ్చే ప్రతిష్టను ఓట్ల కోసం వినియోగించుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.  “మేము రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం. భజన బృందం నడపడం లేదు. భజన పాటలు…

మాయావతిపై ఎఫ్‌ఐ‌ఆర్: గాయాన్ని శిక్షించాలని కత్తి డిమాండ్!

అనుకున్నంతా అయింది! అఖ్లక్ ని చంపారు. అఖ్లక్ కొడుకుని మృత్యు ముఖం వరకూ తీసుకెళ్లారు. మళ్ళీ అఖ్లక్ నీ, ఆయన కుటుంబాన్నే దొషులుగా నిలబెట్టారు, హిందూత్వ కుట్రదారులు. మాయావతిని తిట్టారు. వేశ్య కంటే నీచంగా టికెట్లు అమ్ముకుంటుంది అన్నారు. ఇప్పుడు ఆమె పైన కూడా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి, ఆమెనీ దోషిని చేసేశారు. బాధితులే నేరస్ధులన్న మాట! కత్తిది కాదు, గాయానిదే తప్పన్నమాట! కత్తి దిగబడేంత మెత్తగా ఎవరుండమన్నారు, గాయాన్ని? కత్తి దూసుకొస్తుంటే పక్కకు…

లక్షల దళిత నాయకుల్ని సృష్టించే మంత్రదండం! -కార్టూన్

రాహుల్: ఒకరో ఇద్దరో కాదు, దళితుల కోసం లక్షల నాయకులు ఉద్భవించాలి… రాహుల్ నీడలోని కాంగ్రెస్ నేత: ఆ సూత్రం మనక్కూడా వర్తించడం ఎలాగో… – ఒకరూ, ఇద్దరూ కాదు; పదులూ, వందలూ కూడా కాదు; వేలు అసలే కాదు; ఏకంగా లక్షలాది దళిత నాయకుల్ని తయారు చేసే మంత్రదండం ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మంత్రదండం మన యువ రాజా రాహుల్ గాంధీ వద్ద భద్రంగా ఉంది. ఆయన దాన్ని త్వరలో…

మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం. భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే…

మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై…

అదేదో హిల్లరీతో తేల్చుకోండి, మాయవతితో ‘వికీలీక్స్’ జులియన్

మాయావతి దూషణలకు వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ స్పందించాడు. అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ లో ఉన్న అంశాలతో సమస్య ఉన్నట్లయితే, మాయావతి, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌తో తేల్చుకోవాలని చెప్పాడు. అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి రాసిన కేబుల్ లో మాయవతిని ‘గర్వం ప్రదర్శించే’ వ్యక్తిగా పేర్కొన్నాడు. తనను ఎవరో హత్య చేయనున్నారన్న ఆలోచనతో తన ఆహారాన్ని రుచి చూడడానికి ఇద్దరిని నియమిందుకుందనీ, తొమ్మిది మంది వంటవాళ్ళు ఉన్నారనీ, తనకు నచ్చిన బ్రాండు…

జులియన్ అస్సాంజ్ పిచ్చోడు, ఆయన్ని పిచ్చాసుపత్రికి పంపండి -మాయావతి

వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్‌ ద్వారా వెల్లడయిన సమాచారంలో తనపై ఆరోపణలు రావడం పట్ల మాయావతి స్పందించింది. ఆమె వికీలీక్స్ అధిపతి జులియన్ అస్సాంజ్ పైన విరుచుకుపడింది. జులియన్ పిచ్చోడని చెబుతూ ఆయన దేశం వాళ్ళు ఆయనని పిచ్చాసుపత్రికి పంపాలని కోరింది. వికీలీక్స్ సొంతదారు తన రాజకీయ ప్రత్యర్ధుల చేతుల్లో ఉండడమో లేక పిచ్చోడుగా మారడమో అయి ఉండాలని చెప్పింది. “ఆయన దేశ ప్రభుత్వాన్ని ఆయనను మానసిక రోగుల పునరావాస కేంద్రంలో చేర్చమని విజ్ఞప్తి చేస్తాను. వారి…