హోండురాస్ లో మరో మిలట్రీ స్ధావరాన్ని తెరవబోతున్న అమెరికా

2009 లో మిలట్రీ కుట్ర ద్వారా హోండురాస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మరో మిలట్రీ స్ధావరం నెలకొల్పడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మాన్యువల్ జెలాయా నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యి కుట్ర తో కూల్చి వేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్న నేరాన్ని మోపి రాత్రికి రాత్రి విమానం ఎక్కించి కోస్టారికా దేశానికి ప్రవాసం పంపారు. జెలాయా అధికారంలోకి వచ్చాక కార్మికులకు కనీస వేతనాలను పెంచడం తదితర చర్యలను చేపట్టడంతో పెట్టుబడిదారులు,…